![]() |
![]() |

బాహుబలి ప్రభాస్‌తో తొలిసారి కలిసి నటిస్తోన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే లాక్‌డౌన్ డేస్‌ను జాలీగా గడుపుతోంది. తనకిష్టమైన పిజ్జాలు చేసుకొని తింటూ, గిటార్ వాయిస్తూ, పెట్స్‌తో ఆడుకుంటూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. వాటికి సంబంధించిన పిక్చర్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ అభిమానులనూ ఆనందపరుస్తోంది. లేటెస్ట్‌గా ఆమె షేర్ చేసిన ఫొటో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. కారణం.. ఆ పిక్చర్‌లో ఆమె గ్లామరస్ ఔట్‌ఫిట్‌తో జిగేల్మనిపించడమే. పింక్ కలర్ షోల్డర్ స్ట్రాప్ టాప్, బ్లాక్ డెనిమ్ నిక్కర్స్ ధరించి సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఉన్న ఆ ఫొటోను బుధవారం రాత్రి పోస్ట్ చేయగా, 14 గంటల వ్యవధిలో 8.5 లక్షల లైక్స్ దానికి వచ్చాయి. దాన్ని బట్టి ఆమె ఫ్యాన్స్ ఆ ఫొటో ఎంత పిచ్చగా నచ్చేసిందో ఊహించుకోవచ్చు. quarantine time made me do it అంటూ దానికి హ్యాష్‌ట్యాగ్ జోడించింది పూజా.
ఏప్రిల్ 4న షార్ట్స్ వేసుకొని వంట చేస్తున్న పిక్చర్‌కు, ఏప్రిల్ 5న 9 గంటలకు 9 నిమిషాల కార్యక్రమంలో దీపాలు వెలిగిస్తున్న పిక్చర్‌కు 1 మిలియన్ పైగా లైక్స్ వచ్చాక వాటికంటే ఎక్కువగా ఈ గ్లామరస్ సెల్ఫీ పిక్చర్ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ కోరుకున్న దానికి మించి ఈ పిక్చర్‌తో పూజా వాళ్లను ఆనందింపజేసిందనే కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లాక్‌డౌన్ పీరియడ్ ముగిసిన తర్వాత ఆమె మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీలో అఖిల్ జోడీగా మురిపించేందుకు సిద్ధమవుతోంది.

![]() |
![]() |