![]() |
![]() |

సోషల్ మీడియాలో కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయల్ని వెల్లడించడం రష్మీ గౌతమ్‌కు అలవాటు. తన ఫాలోయర్స్ ఎవరైనా హద్దు మీరి మాట్లాడితే, ఏవైనా ప్రశ్నలు అడిగితే, వాటికి అంతే దీటుగా జవాబులిస్తుంటుంది. ఇటీవల ఆమె ట్విట్టర్ కంటే ఇన్‌స్టాగ్రామ్‌నే ఎక్కువగా ఉపయోగిస్తోంది. అయినప్పటికీ మంగళవారం ట్విట్టర్‌లో తన ఫాలోయర్స్‌తో సంభాషించింది రష్మి. ఆ సందర్భంగా #AskRashmi అనే హ్యాష్‌టాగ్ ట్రెండింగ్‌లోకి కూడా వెళ్లింది. ఒక అభిమాని మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారని అడిగితే, తనదైన స్టైల్‌లో, "పర్సనల్ లైఫ్‌ను ఎందుకు పర్సనల్ లైఫ్ అంటారనే దానికి ఓ కారణం ఉంది. నా వైపు నుంచి, నా వృత్తిపరమైన, కమ్యూనిటీ పరమైన పనులు మీకు ఎప్పుడైనా తెలుస్తాయి. మిగిలినవి ఎప్పటికీ పర్సనల్‌గానే ఉంటాయి" అని జవాబిచ్చింది.
"సుడిగాలి సుధీర్ మీద జెన్యూన్‌గా మీ అభిప్రాయం మాత్రం చెప్పండి.. ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ ఉందా? లేక కేవలం టీవీ షో ప్రోగ్రామ్స్‌లో టైమ్ పాసా? తప్పుగా అనుకోవద్దు. స్పోర్టివ్‌గా తీసుకోండి. గాసిప్స్ మాట్లాడుకోవడం మనిషి మనస్తత్వం కదా" అని ఒక అభిమాని ప్రశ్న సంధించాడు. దానికి "గాసిప్ అనేది మీ టైమ్ పాస్, నాకు కాదు. కాబట్టి మీ టైమ్ పాస్‌ను కొనసాగించండి" అని వీపు మీద చరిచినట్లు చెప్పింది. ఈ జవాబుల్ని బట్టి ఎప్పటికీ రష్మి తన వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోదనేది స్పష్టం.
![]() |
![]() |