![]() |
![]() |

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రేంజికి వెళ్లి, ఆ వెంటనే బాలీవుడ్‌కు వెళ్లిపోయిన ఇలియానా.. ఇప్పుడు లాక్‌డౌన్ పీరియడ్‌లోనూ తన అభిమానలకు కిర్రెక్కించడం మానలేదు. ఒకప్పుడు ఫిజీలో టూ పీస్ వైట్ బికినీ పీస్‌లో బీచ్‌లో ఉండగా తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్యాంట్ లేకుండా తీసుకున్న ఈ ఫొటోకు నిమిషాల వ్యవధిలో లక్షల లైక్స్ రావడం గమనార్హం. "కాళ్లకు చెప్పులు లేకుండా, ప్యాంట్స్ వేసుకోకుండా, పొట్టి జుట్టులో పూలు పెట్టుకున్న పాత ఫొటో" అని ఆ కిరాక్ ఫొటోతో పాటు రాసుకొచ్చింది ఇలియానా.
బాలీవుడ్‌లో ఆఫర్లు బాగా తగ్గిపోవడంతో తిరిగి టాలీవుడ్‌లో ఆఫర్ల కోసం ఇలియానా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న ఒక గాసిప్ ప్రకారం 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ భార్య రోల్‌కు తనను తీసుకొనే చాన్స్ ఉన్నాయేమో పరిశీలించమని నిర్మాత దిల్ రాజును ఆమె అడిగింది. అయితే ఆయన ఇలియానా కంటే శ్రుతి బాగుంటుందని భావించి, ఆమెను సంప్రదించడం, తెలీని కారణాల వల్ల ఆమె దాన్ని వదులుకోవడం జరిగిపోయాయి. దీంతో తిరిగి ఇలియానా పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆ పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ పవర్ స్టార్ వైఫ్ రోల్ కావడం వల్ల దాన్ని చేయడానికి ఇలియానా సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇలియానా చివరగా శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన 'అమర్ అక్బర్ ఆంటోని' మూవీలో రవితేజ జోడీగా నటించింది. ఇక ఇదివరకు పవన్ కల్యాణ్‌తో 'జల్సా' వంటి హిట్ మూవీ చేసిన విషయం తెలిసిందే.
.jpg)
![]() |
![]() |