![]() |
![]() |

'పాప' (PAPA) అంటే 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అని మీనింగ్. నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూడో సినిమా. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' విజయాలు సాధించాయి. ముచ్చటగా మూడోసారీ హిట్ కొట్టాలన్న ఈ కాంబినేషన్‌కి ఆది నుండి ఏదో అడ్డంకి ఎదురవుతోంది. తాజాగా ఈ సినిమాకి ఎదురైన అడ్డంకి పేరు కరోనా.
అసలు వివరాల్లోకి వెళితే... గతేడాది 'పాప' షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇండియాలో తీయాల్సిన సన్నివేశాలను పూర్తి చేశారు. కథానుగుణంగా అమెరికాలో కొంత భాగం తీయాలి. అక్కడికి వెళ్లడానికి మొదట వీసాలు లభించలేదు. దాంతో కొన్నాళ్లు షూటింగ్ వాయిదా పడింది. మార్చి 15న అమెరికా వీసాల కోసం హైదరాబాద్‌లోని యూఎస్ ఎంబసీకి వెళ్లాలని అనుకున్నారు. కరోనా కారణంగా ఎంబసీ క్లోజ్ చేశారు. పైగా, ఇప్పుడు అమెరికాలో కరోనా వేలాదిమంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. అక్కడ వైరస్ తీవ్రత ఎక్కువ ఉంది. అందుకని, స్టొరీ బ్యాక్‌డ్రాప్‌ను అమెరికా నుండి యూకేకి మారిస్తే ఎలా ఉంటుందని దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఆలోచిస్తున్నారు. యూకేలో కరోనా లేదా? అంటే ఉంది. అయితే, అమెరికాలో ఉన్నత తీవ్రత యూకేలో లేదు. అక్కడ వైరస్ త్వరగా నశించవచ్చని ఆశిస్తున్నారు. ఆ తర్వాత షూటింగ్ చేయాలని అనుకుంటున్నారు.
![]() |
![]() |