![]() |
![]() |

భారతీయ సంప్రదాయంలో ఇంటి వంట మహిళలే చేస్తారు. భర్త, పిల్లలకు నచ్చినవి చేసి పెడతారు. అందులో ఓ ప్రేమ ఉంటుంది. ఎప్పుడూ మహిళలే వంట చేయాలా? బట్, ఫర్ ఏ చేంజ్... భార్య కోసం భర్త వంట చేసి పెడితే? రామ్‌చరణ్ అదే పని చేశారు. బుధవారం రాత్రి శ్రీమతి ఉపాసన కోసం వండి పెట్టారు. ఇందులోనూ ప్రేమ ఉంది కదూ! "కుకింగ్ డిన్నర్ ఫర్ మిస్సెస్ ఉపాసన" అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే... ఆయన సాల్మన్ ఫిష్, క్యారెట్ ఫ్రై చేస్తున్నట్టున్నారు.
భర్త 'మిస్టర్ సి' (రామ్‌చరణ్‌ని ఉపాసన అలాగే పిలుస్తారు) వంట చేయడంతో ఉపాసన ఫుల్ ఖుషీ అయ్యారు. "థాంక్స్. నువ్ డిస్టింక్షన్‌లో పాస్ అయ్యావు" అని పేర్కొన్నారు. అంటే... చెర్రీ వంట ఆమెకు బాగా నచ్చిందన్నమాట. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా చరణ్, ఉపాసన ఇంటి గడప దాటి బయటకు రావడం లేదు. అయితే, ఎప్పుడూ ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రజలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు. అలాగే, వర్కవుట్స్ చేసేలా మోటివేట్ చేస్తున్నారు.


![]() |
![]() |