![]() |
![]() |

వెంకటేష్ సరసన 'సుభాష్ చంద్రబోస్', 'గోపాల గోపాల' సినిమాల్లో శ్రియ నటించారు. 'తులసి'లో వెంకీ కోసం ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు. ఇద్దరికీ పరిచయం ఉంది. సినిమాల పరంగా మాత్రమే కాదు, ఫ్యామిలీ పరంగానూ రెండు ఫ్యామిలీస్ మధ్య చక్కటి పరిచయం ఉందని లాక్ డౌన్ వల్ల తెలిసింది. వెంకీ పెద్ద కుమార్తె ఆశ్రితకు కుకింగ్ అంటే ఇష్టమనేది తెలిసిన విషయమే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఒక అకౌంట్ మైంటైన్ చేస్తున్నారు. తనకు ఇష్టమైన వంటలు, తాను వండిన వంటలు, ఫుడ్ రెసిపీస్ పోస్ట్ చేస్తుంటారు. అంతే కాదు... ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో సింపుల్‌గా కేక్ ఎలా కుక్ చేయాలో కూడా చెబుతున్నారు.
ఏప్రిల్ 15న శ్రియ భర్త ఆండ్రీ బర్త్ డే. యాక్చువల్లీ... శ్రియ దంపతులు స్పెయిన్‌లోని బార్చిలోనాలో ఉన్నారు. అక్కడ కరోనా తీవ్రత ఎక్కువ ఉండడంతో ఇంట్లో నుండి బయటకు అడుగుపెట్టడం లేదు. అందుకని, ఇంట్లో హజ్బెండ్ కోసం కేక్ వండాలని అనుకున్నారు. దానికోసం ఆమె ఎవరి హెల్ప్ తీసుకున్నారో తెలుసా.. ఆశ్రిత హెల్ప్! ఆశ్రిత సలహాలు, సూచనలతో మగ్ కేక్ కుక్ చేశారు శ్రియ. ప్రజలకు టెక్నాలజీ ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట.

![]() |
![]() |