![]() |
![]() |

ప్రస్తుత పరిస్థితుల్లో నిజమైన సూపర్‌స్టార్లు ఎవరంటే... ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని కాలు బయటకు పెట్టని ప్రజలు. రీల్ లైఫ్‌లో మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లోనూ మహేష్‌బాబు సూపర్‌స్టార్ అనిపించుకుంటున్నారు. ప్రజలు, సినీ కార్మికుల కోసం విరాళం ఇచ్చారు. అలాగే, ఇంట్లో ఉంటూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలు గౌతమ్, సితారతో మహేష్ ఆడుకుంటున్న ఫొటోలను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే... మహేష్, సితార ఒక్కటై గౌతమ్‌ని ఓడించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మిగతా మేటర్ కూడా చదవండి.
ముగ్గురూ కలిసి ఒక గేమ్ ఆడుతున్నారు. అందులో గౌతమ్ విన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఈలోపు తండ్రీకూతుళ్ళు ఒక్కటి అయ్యారు. మహేష్, సితార కలిసి జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. చిరునవ్వుతో బుద్ధుడు లాంటి నా కుమారుడు గౌతమ్ వాళ్లకు సరెండర్ అయ్యాడని నమ్రత చెప్పారు. "ఇంట్లో ఉండండి. సేఫ్ గా ఉండండి. మీరూ ఇటువంటిది ఏదో ఒకటి చేయండి. మీ సంతోషం వెతుక్కోండి. మాతో అటువంటి కథలు పంచుకోండి. మీ కథలు వినాలని మాకూ ఉంది" అని నమ్రత అన్నారు. అదీ సంగతి.
.jpg)
![]() |
![]() |