![]() |
![]() |

మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తోన్న 'సర్కారువారి పాట' నుంచి ఇప్పటివరకూ రెండు పాటలు విడుదలయ్యాయి. మొదటి పాట 'కళావతి' ఇప్పటికే సూపర్ పాపులర్ కాగా, ఆదివారం రిలీజ్ చేసిన రెండో పాట 'పెన్నీ' కూడా అదే దిశగా కొనసాగుతోంది. తమన్ స్వరాలు కూర్చిన 'పెన్నీ' సాంగ్‌ను అనంత శ్రీరామ్ రాశారు. నకష్ అజీజ్ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో 24 గంటల్లో 18 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో కొత్త రికార్డు సృష్టించిందని చిత్ర బృందం తెలిపింది.
సెకండ్ సింగిల్ విషయంలో అత్యంత వేగంగా లక్ష లైక్స్ సాధించిన పాటగా, లిరికల్ సాంగ్స్‌లో అత్యంత వేగంగా లక్ష లైక్స్ సాధించిన రెండో పాటగా, అత్యంత వేగంగా 15 మిలియన్ వ్యూస్ సాధించిన లిరికల్‌గా, దక్షిణ భారతదేశంలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన రెండో సింగిల్‌గా, టాలీవుడ్‌లో 24 గంటల్లో అత్యధికులు లైక్ చేసిన రెండో పాటగా, 24 గంటల్లో అత్యధికులు వీక్షించిన టాలీవుడ్ లిరికల్‌గా 'పెన్నీ' సాంగ్ రికార్డులు సాధించింది.
ఈ పాట ప్రమోషనల్ సాంగ్‌లో మహేశ్ కుమార్తె సితార వేసిన డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. పరశురామ్ పేట్ల డైరెక్ట్ చేసిన 'సర్కారువారి పాట'లో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ నటించింది. మే 12న ఈ మూవీని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |