![]() |
![]() |

హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి డైరెక్టర్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తున్నారో తెలిసిందే. ప్రెస్ మీట్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ తో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సందడే కనిపిస్తుంది. థియేటర్స్, టీషర్ట్స్, టీ కప్స్, వాటర్ బాటిల్స్ ఇలా ఎన్నో రకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ ఈ రేంజ్ లో ఉంటే.. 'గని' మూవీ మాత్రం ఆర్ఆర్ఆర్ నే ప్రమోషన్ కి వాడుకుంటుంది.
వరుణ్ తేజ్ టైటిల్ రోల్ పోషించిన మూవీ 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 8 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ ని వారధిగా ఎంచుకున్నారు మేకర్స్. సౌత్ ఇండియా వైడ్ గా ఆర్ఆర్ఆర్ ప్రదర్శితమవుతున్న 1000 కి పైగా స్క్రీన్స్ లో గని ట్రైలర్ ని ప్రదర్శించనున్నారు. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో మూవీ టీమ్ ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
గని సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి, కన్నడ యాక్టర్ ఉపేంద్రతో పాటు టాలీవుడ్ యాక్టర్స్ జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాని భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ విడుదలైన రెండు వారాల తర్వాత థియేటర్స్ అడుగుపెట్టనున్న ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
![]() |
![]() |