![]() |
![]() |

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపి, సోదాలు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించడమే కాకుండా, రూ. 700 జరిమానా కూడా విధించారు. వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించకూడదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తారక్ కారును తనిఖీ చేసిన సమయంలో కారులో ఆయన లేరు. ఆయన కుమారుడు భార్గవ్ రామ్, మరో వ్యక్తి ఉన్నారు. కారును వారి డ్రైవర్ నడుపుతున్నాడు. తారక్ ప్రస్తుతం రాజమౌళి, రామ్‌చరణ్‌తో కలిసి 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ నిమిత్తం దేశమంతా తిరుగుతున్నాడు.
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా చాలామంది సెలబ్రిటీలు తమ వాహనాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించకుండా బయటకు వస్తున్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లో జరిగిన కారు ప్రమాదం ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా తారక్ వాహనాన్ని ఆపి, బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు.
![]() |
![]() |