![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన 'వలిమై' మూవీ ఫిబ్రవరి 24 న థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటించిన ఈ మూవీ ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంపై ఈనెల 25 నుంచి ప్రదర్శితం కానుంది. అయితే థియేటర్స్ లో విడుదల సమయంలో ఎలా సెలెబ్రేషన్స్ జరిగాయో.. ఇప్పుడు అంతకుమించిన సెలెబ్రేషన్స్ జరగడం విశేషం.
ఈనెల 25 న ఓటీటీలో 'వలిమై' విడుదలవుతున్న నేపథ్యంలో 'ZEE5` సంస్థ చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో 10,000 అడుగుల పొడవైన అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం లో ఏ ఓటీటీ సంస్థ ఇటువంటి అతి పెద్ద పోస్టర్ ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్ టాక్ ఆఫ్ టౌన్ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ విషయం విపరీతంగా వైరల్ అవుతూ అజిత్ ఇమేజ్‌ను మరింతగా పెంచుతోంది. అజిత్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వలిమై' సినిమాని జీ స్టూడియోస్ తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మించారు. ఈ మూవీలో హుమా ఖురైషీ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు.
![]() |
![]() |