![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న 'గాడ్‌ఫాదర్' మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మలయాళం బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. ఒరిజినల్‌లో మోహన్‌లాల్ చేసిన టైటిల్ రోల్‌ను తెలుగు రీమేక్‌లో చిరంజీవి చేస్తున్నాడు. అలాగే ఒరిజినల్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన స్పెషల్ క్యారెక్టర్‌ను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు.
సల్మాన్ 'గాడ్‌ఫాదర్' సెట్స్‌పై అడుగుపెట్టారని తెలియజేస్తూ, ఆయనతో దిగిన ఫొటోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటో తెగ వైరల్ అయింది. ఇక ఈ సినిమాని నిర్మిస్తున్న సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థ తాజాగా మరో ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలో చిరంజీవి, సల్మాన్ తో పాటు డైరెక్టర్ మోహన్ రాజా, నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఫోటోలో లుక్, డ్రెస్సింగ్ స్టైల్ తో మెగాస్టార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 'మెగా క్లిక్' పేరుతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'గాడ్‌ఫాదర్'లో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై సురేఖ సమర్పిస్తోన్న ఈ మూవీకి తమన్ సంగీతం సమకూరుస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.
![]() |
![]() |