![]() |
![]() |

`బొబ్బిలి సింహం`, `సమర సింహా రెడ్డి`, `నరసింహనాయుడు`, `లక్ష్మీ నరసింహా`, `సింహా`, `జై సింహా`.. ఇలా టైటిల్ లో `సింహ`ధ్వని ఉన్న పలు చిత్రాలు నటసింహం నందమూరి బాలకృష్ణకి భలే విజయాలను అందించాయి. ఈ క్రమంలోనే.. త్వరలో మరోసారి బాలయ్య `సింహా`వతారమెత్తనున్నారని టాక్.

ఆ వివరాల్లోకి వెళితే.. `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ బాట పట్టిన ఈ చిత్రం కోసం మరోసారి శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వబోతున్నారు ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో. తాజాగా ఫస్ట్ లుక్ లో రివీలైన సరికొత్త గెటప్ తో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు మేకర్స్. కాగా, ఈ సినిమా సబ్జెక్ట్ కి తగ్గట్టుగా `వీర సింహా రెడ్డి` అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరి.. `సింహా` టైటిల్ సెంటిమెంట్ రిపీటై.. బాలకృష్ణ ఖాతాలో మరో పవర్ ఫుల్ హిట్ క్రెడిట్ అవుతుందేమో చూడాలి.
Also Read: నిత్యకి పవన్ కూడా అచ్చొస్తాడా!?
కాగా, బాలయ్య - గోపీచంద్ కాంబో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.
![]() |
![]() |