![]() |
![]() |

'రాధేశ్యామ్' సినిమాలో విక్రమాదిత్యగా రెబల్ స్టార్ ప్రభాస్ అలరించనున్నాడు. మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో ప్రభాస్ పాత్ర పేరు విక్రమాదిత్య ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్ళింది. ఇప్పుడు ఇదే టైటిల్ తో ఓ సినిమా రాబోతోంది. దానికి తేజ దర్శకత్వం వహించనుండటం విశేషం.
చిత్రం(2000), నువ్వు నేను(2001), జయం(2002) వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచుకున్న తేజను ఆ తర్వాత వరుస పరాజయాలు పలకరించాయి. 2017 లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన.. ఆ తర్వాత వచ్చిన 'సీత'తో నిరాశపరిచాడు. అయినప్పటికీ ఆయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ 'అహింస' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న మరో మూవీ అప్డేట్ వచ్చింది.

నేడు(ఫిబ్రవరి 22) తేజ పుట్టిన రోజు సందర్భంగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చింది. నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ సినిమాకి 'విక్రమాదిత్య' అనే టైటిల్ పెట్టారు. ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభమని తెలుపుతూ ప్రీలుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఆ పోస్టర్ 'రాధేశ్యామ్'ని గుర్తు చేస్తోంది. అంతేకాదు ఇది కూడా పీరియాడిక్ లవ్ స్టోరీ లవ్ స్టొరీ కావడం విశేషం. ఈ ప్రేమ కథ కోసం తేజ మనల్ని 1836 లోకి తీసుకెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
![]() |
![]() |