![]() |
![]() |

`వకీల్ సాబ్` వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా `భీమ్లా నాయక్`. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి తెలుగు వెర్షన్ గా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఫిబ్రవరి నెలలో వచ్చిన తమన్ చిత్రాల్లో సింహభాగం బాక్సాఫీస్ ముంగిట నిరాశపరిచాయి. `నిప్పు` (2012)తో మొదలుకుని `జబర్ దస్త్` (2013), `విన్నర్` (2017), `ఇంటిలిజెంట్` (2018), `గాయత్రి` (2018), `తొలిప్రేమ` (2018).. ఇలా ఆరు సార్లు తమన్ ఫిబ్రవరిలో సందడి చేయగా వాటిలో `తొలిప్రేమ` మినహా మిగిలిన చిత్రాలన్నీ డిజప్పాయింట్ చేశాయి. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన `తొలిప్రేమ` కూడా డీసెంట్ హిట్ అనిపించుకుందే తప్ప బ్లాక్ బస్టర్ అయితే కాదు. మరి.. తమన్ ఫిబ్రవరి నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి `భీమ్లా నాయక్` అయినా బ్లాక్ బస్టర్ బాట పడుతుందేమో చూడాలి.
![]() |
![]() |