![]() |
![]() |

సీనియర్ యాక్టర్ నరేష్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఆయన మూడో భార్య రమ్య రఘుపతిపై హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే నరేష్ మాత్రం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.
మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్య రఘుపతిని 8 ఏళ్ల క్రితం నరేష్ మూడో వివాహం చేసుకున్నారు. కానీ కొంత కాలంగా వీరు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అయితే ఆమె నరేష్ పేరుతో మోసాలకు పాల్పడిందట. ఆమె నరేష్ పేరుతో డబ్బు వసూలు చేస్తోందంటూ తాజాగా ఐదుగురు మహిళలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందూపూర్, అనంతపురం, హైదరాబాద్ లో భారీగా డబ్బు వసూలు చేసినట్టు ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి.
నరేష్‌కు ఉన్న ఆస్తులను చూపించి.. ఈ ఆస్తి అంతా తనకే చెందుతుందని చెబుతూ చాలా మంది నుంచి రమ్య డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. రోజులు గడిచినా ఆమె నుంచి డబ్బు తిరిగి రాకపోవడం, సరైన స్పందన లేకపోవడంతో పలువురు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమె చేసిన ఘరానా మోసం బయటపడింది. అయితే ఈ విషయంపై స్పందించిన నరేష్.. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
![]() |
![]() |