![]() |
![]() |
.webp)
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో, ఆయన గౌరవార్థం సోమవారం సాయంత్రం జరగాల్సిన 'భీమ్లా నాయక్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ కొత్త తేదీని మూవీ టీమ్ ప్రకటించింది. బుధవారం సాయంత్రం ఈ ఈవెంట్ జరగనుంది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా సోమవారం నాడు భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే సోమవారం ఉదయం ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో, ఆయన గౌరవార్థం ఈవెంట్ వాయిదా వేయాలని మూవీ టీమ్ నిర్ణయం తీసుకుంది. తాజాగా కొత్త తేదీని ప్రకటించింది. రేపు సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపింది. మరి ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతారో లేదో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన మంత్రిగా చాలా బిజీగా ఉంటారు. ఆయన వీలుని బట్టి మొదట ఈవెంట్ ని సోమవారం సాయంత్రం ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇప్పుడు వాయిదా పడటంతో కేటీఆర్ రాకపై సందేహాలు నెలకొన్నాయి. మేకర్స్ సైతం కొత్త పోస్టర్ లో చీఫ్ గెస్ట్ గురించి ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడినప్పటికీ, ఈ మూవీ ట్రైలర్ ని మాత్రం నిన్న రాత్రి 9 గంటలకు విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ రికార్డు వ్యూస్, లైక్స్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన ఈ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ఈ నెల 25 న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |