![]() |
![]() |

నటిగా, నాట్యకారిణిగా మధురిమ నార్ల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ విదేశాలలో ఎన్నో క్లాసికల్ డాన్స్ పర్ఫామెన్స్ లు ఇచ్చి పలు అవార్డులు సొంతం చేసుకున్న ఆమె, నటిగానూ పలువురు స్టార్ హీరోలు సినిమాలలో నటించి మెప్పించారు. కృష్ణ కూతురిగా 'బొబ్బిలి దొర' సినిమాలో, బాలకృష్ణ చెల్లెలిగా 'బొబ్బిలి సింహం', 'పెద్దన్నయ్య' సినిమాలలో, నారాయణమూర్తి చెల్లెలిగా 'ఒరేయ్ రిక్షా'లో ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాట్యం కోసం సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె 'శతమానం భవతి' సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆమె వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమయ్యారు.
ప్రస్తుతం మధురిమ సమంత టైటిల్ రోల్ పోషిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'యశోద'లో కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో మధురిమ ఒక మంచి పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నారు.
అలాగే యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన 'స్టాండప్ రాహుల్' సినిమాలో మరో విలక్షణ పాత్రలో నటించారు మధురిమ. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో వర్ష బొల్లమ్మ హీరోయిన్. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |