![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా 'తానాజీ' ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో రాబోతున్న 3డి యాక్షన్ డ్రామా 'ఆదిపురుష్'. రామాయణ గాథ ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీరామునిగా ప్రభాస్, రావణాసురునిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దర్శనమివ్వనున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం మోషన్ క్యాప్చర్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే.. 'ఆదిపురుష్' ప్రపంచాన్ని సృష్టించే పనిలో చిత్ర బృందం బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. 'ఆదిపురుష్'లో డ్రీమ్ గాళ్ గా పేరు పొందిన సీనియర్ యాక్ట్రెస్ హేమామాలిని ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారని సమాచారం. కథానాయకుడి తల్లి కౌసల్య పాత్రలో హేమ కనిపిస్తారని టాక్. త్వరలోనే 'ఆదిపురుష్'లో హేమామాలిని ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా, కథానాయికగా కృతి సనన్ నటిస్తారని జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
2022 పంద్రాగస్టు వారాంతంలో (2022 ఆగస్టు 11) 'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |