![]() |
![]() |

టాలీవుడ్‌లో బ్యాచిలర్స్, బ్యాచిలరెట్స్ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటూ వస్తున్నారు. రానా, నితిన్, నిఖిల్, కాజల్ అగర్వాల్ పెళ్లిళ్లు చేసుకొని వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. డిసెంబర్‌లో నాగబాబు కుమార్తె నిహారిక కూడా కొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్నారు. డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు వెంకటచైతన్య జొన్నలగడ్డతో మూడు ముళ్లు వేయించుకోవడానికి ఆమె రెడీ అవుతున్నారు. ఇప్పటికే వీరి వివాహ శుభలేఖలను అచ్చువేయించే పనిలో ఉన్నారు. చైతన్య తల్లిదండ్రులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని వివాహ పత్రికను ఆయన దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. బిట్స్ పిలానీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన చైతన్య హైదరాబాద్‌లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాడు.
కాగా పెళ్లి సమయం దగ్గరపడుతున్న కొద్దీ బంధువులతో ఎక్కువ సమయం గడిపేందుకు ఉత్సాహం చూపుతున్నారు నిహారిక. శనివారం రాత్రి తన సమీప బంధువులైన ఇద్దరు అమ్మాయిలతో కలిసి తీయించుకున్న పిక్చర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసి, "సిస్టర్స్ బిఫోర్ మిస్టర్స్" అనే క్యాప్షన్ జోడించారు.

కాగా వివాహానంతరం నిహారిక నటనకు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాల్లో నటించకపోయినా, గతంలో మాదిరిగా టెలివిజన్ షోలకు హోస్ట్‌గా చేసే అవకాశాలున్నాయంటున్నారు. చివరిసారిగా ఆమె చిరంజీవి సినిమా 'సైరా.. నరసింహారెడ్డి'లో వారియర్‌గా ఒక చిన్న పాత్రలో కనిపించారు.

![]() |
![]() |