![]() |
![]() |

నిహారిక కొణిదెల, వెంకటచైతన్య జొన్నలగడ్డ వివాహ ఘడియలు దగ్గరకొచ్చేశాయి. మరి కొద్ది సేపట్లో నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేయనున్నాడు. కాగా, బుధవారం పసుపు-కుంకుమ వేడుక యమ జోరుగా జరిగింది. వధూవరులు పసుపు బట్టల్లో మెరిసిపోగా, మొదట సంప్రదాయం ప్రకారం ముత్తైదువలు ఆ ఇద్దరినీ జల్లెడ పాత్రలతో నీళ్లు పోసి తడిసి ముద్దయ్యేట్లు చేశారు. ఆపైన ఆడా మగా తేడా లేకుండా మెగా ఫ్యామిలీలోని కుర్రాళ్లందరూ ఆ వేడుకలో మెగా జోష్‌తో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు నీళ్లు పోసి హంగామా చేశారు. బిందెలతో, ప్లాస్టిక్ బాస్కెట్లతో నీళ్లు ముంచి వాటిని ఎదుటివాళ్లపై పోశారు.

వరుడు చైతన్య ఈ ఉత్సవంలో చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. ఉదయ్‌పూర్‌కు వెళ్లక ముందు నుంచే మొదలైన పెళ్లి పనుల్లో నిహారికకు ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలేట్లు అందరూ కృషి చేస్తున్నారు. కొన్నేళ్ల పాటు ఈ పెళ్లి గురించి గొప్పగా చెప్పుకొనే విధంగా పెళ్లికి సంబంధించిన అన్ని వేడుకలు ఉత్సవంలా జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరూ ఈ వేడుకలో పాల్గొంటుండటం గమనార్హం.


![]() |
![]() |