![]() |
![]() |

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్. యాక్షన్ సాగాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హొంబళే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. 2022 ఆరంభంలో థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కథానాయికగా అనుష్క నటించే అవకాశముందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. లోఫర్ ఫేమ్ దిశా పటాని పేరు పరిశీలనలో ఉందని తెలిసింది. బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన రాధేలో నటిస్తోంది. ఇప్పుడు ప్రభాస్ కి జోడీగా నటించే ఛాన్స్ దక్కడం చూస్తే.. దిశా పటాని దశ, దిశ మేలిమలుపు తిరగబోతున్నట్లే.
మరి.. రాధేశ్యామ్ హీరో, రాధే హీరోయిన్ జోడీ ఏ స్థాయిలో మురిపిస్తుందో చూడాలి.
![]() |
![]() |