![]() |
![]() |

నిహారిక, చైతన్య పెళ్లి పనులు జోరుగా హుషారుగా నడుస్తున్నాయి. అతిథులందరూ ఒక్కొక్కరే చేరుకొని, వివాహ వేదిక అయిన ఉదయ్ విలాస్ ప్యాలెస్‌ను సందడిగా మార్చేశారు. మంగళవారం రాత్రి జరిగిన గోరింటాకు వేడుకలో పవన్ కల్యాణ్, ఆయన పిల్లలు అకిర నందన్, ఆద్య సైతం తళుక్కుమన్నారు. సంగీత్, పసుపు కుంకుమ, గోరింటాకు వేడుకల్లో వధూవరులు నిహారిక, చైతన్య తమ కలర్‌ఫుల్ డ్రస్సులతో ముచ్చటగొలిపారు. అలాగే అందరి దృష్టీ రామ్‌చరణ్ దంపతులు, అల్లు అర్జున్ దంపతులపై కూడా నిలిచాయి.
చరణ్ భార్య ఉపాసన, బన్నీ భార్య స్నేహ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా భర్తలతో కలిసి దిగిన పిక్చర్స్‌ను షేర్ చేశారు. వీటిని ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో వైరల్ చేస్తున్నారు. మెహందీ ఫంక్షన్‌లో ఆహ్వానితుల్లో ఎక్కువ మంది కలర్‌ఫుల్ డ్రస్సుల్లో మెరవగా, రామ్‌చరణ్-ఉపాసన జోడీ మాత్రం వైట్ కలర్ డ్రస్సులను ప్రిఫర్ చేశారు. చరణ్ వైట్ సూట్ షర్ట్, దానికి మ్యాచింగ్ ట్రౌజర్స్, బ్లాక్ షూస్ ధరిస్తే, ఉపాసన వైట్, పింక్ మిక్సడ్ లెహంగా, దానిపైన ఫుల్ స్లీవ్ టాప్, వైట్ కలర్ ఫాక్స్-ఫెదర్ జాకెట్ ధరించారు.

బుధవారం ఉదయం బన్నీ-స్నేహ జోడీ స్టన్నింగ్‌గా కనిపించింది. బన్నీ వైట్ కుర్తా-పైజమా ధరించాడు. కుర్తా మీద పింక్ ఎలిఫెంట్ డిజైన్ ఆకట్టుకుంది. కాళ్లకు గోల్డ్ కలర్ స్నీకర్స్ వేసుకున్నాడు. స్నేహ రెడ్, బ్లూ, గోల్డ్ కలర్స్ కాంబినేషన్ స్కర్ట్, దానిపై ప్లియన్ బ్లాక్ టాప్ ధరించారు. అటు మెగా పవర్‌స్టార్ జోడీ, ఇటు స్టైలిష్ స్టార్ జోడీ నిహారిక పెళ్లి వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా సందడి చేస్తున్నారు.

![]() |
![]() |