![]() |
![]() |

నిన్నటి తరం కథానాయకుడు శ్రీకాంత్ కెరీర్ ని మేలిమలుపు తిప్పిన చిత్రం పెళ్ళి సందడి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. 1996 సంక్రాంతికి విడుదలై అఖండ విజయం సాధించింది. కట్ చేస్తే.. పాతికేళ్ళ తరువాత నయా వెర్షన్ లో తెరకెక్కుతోందీ సినిమా. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. గౌరి రోనక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని టాక్. కథను కీలక మలుపు తిప్పే పాత్ర ఇదని.. నిడివి తక్కువే అయినా ప్రభావవంతంగా ఉంటుందని సమాచారం. త్వరలోనే శ్రీకాంత్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా, ఈ సినిమాలో రోషన్ కి జోడీగా ఖుషీ కపూర్, మాళవికా నాయర్ నాయికలుగా నటించే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2021 జనవరిలో పట్టాలెక్కనుంది.
![]() |
![]() |