![]() |
![]() |

మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం.. తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ కథానాయకుడిగా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాని సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తోంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి తమన్ ఇప్పటికే రెండు పాటలకు ట్యూన్స్ రెడీ చేశాడని సమాచారం. కథానుసారం సాగే గీతాలుగా ఈ పాటలుంటాయని టాక్. అంతేకాదు.. మొత్తం మూడు పాటలు మాత్రమే ఇందులో ఉంటాయని వినిపిస్తోంది. మరి.. తమన్ అందిస్తున్న బాణీలు ఈ రీమేక్ కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా పవన్ నటిస్తున్న ఈ చిత్రంలో మరో కథానాయకుడు ఎవరనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
![]() |
![]() |