![]() |
![]() |

నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శివ నిర్వాణ. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నేచురల్ స్టార్ నాని హీరోగా టక్ జగదీష్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. వచ్చే ఏడాది వేసవి ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్.. థియేటర్స్ లో సందడి చేయనుంది. కాగా, ఈ లోపే తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు శివ ప్లాన్ చేస్తున్నాడట.
ఈ సారి యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో శివ సినిమా చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం.. మార్చి ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ఇప్పటికే విజయ్, శివ కాంబినేషన్ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే మరిన్ని విషయాలు వెల్లడి కానున్నాయి. మరి.. ఫీల్ గుడ్ మూవీస్ తోనే ముందుకు సాగుతున్న శివ.. విజయ్ తోనూ ఆ తరహా సినిమానే చేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |