![]() |
![]() |

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని చేతిలో మూడు చిత్రాలున్నాయి. శివ నిర్వాణ రూపొందిస్తున్న టక్ జగదీష్ చిత్రీకరణ తుది దశలో ఉండగా.. రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించనున్న శ్యామ్ సింగ రాయ్ రేపు పూజాకార్యక్రమాలు జరుపుకుని నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది. ఇక వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రానున్న అంటే సుందరానికీ.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. టక్ జగదీష్ లో రీతూ వర్మ, ఐశ్వర్యారాజేష్ నాయికలుగా నటిస్తుండగా.. అంటే సుందరానికీ!లో నజ్రియా ఫాహద్ హీరోయిన్. పిరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న శ్యామ్ సింగ రాయ్ లో
సాయిపల్లవి, కృతి శెట్టి నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో మూడో హీరోయిన్ రోల్ కూడా ఉంటుందట. ఆ పాత్రలో రాశీఖన్నా కనిపిస్తుందని బజ్. త్వరలోనే రాశి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి..
నాని, రాశి ఫస్ట్ కాంబినేషన్ ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
![]() |
![]() |