![]() |
![]() |

దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా కార్తీక్ శంకర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆమె ఒక సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్.
'రాజావారు రాణిగారు', 'ఎస్ ఆర్ కళ్యాణమండపం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. పక్కింటి కుర్రాడిలా అనిపించే కిరణ్ మరో ఆసక్తికర సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అనే టైటిల్ ని ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. గత చిత్రాల్లో సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపించిన కిరణ్.. ఈ పోస్టర్ లో మాస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇది కిరణ్ నటిస్తున్న ఐదో సినిమా. ఈ మూవీ ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. ఇక ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించడం విశేషం.

కిరణ్ హీరోగా నటించిన మూడో సినిమా 'సెబాస్టియన్ పీసీ 524' మార్చి 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రేచీకటి పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కిరణ్ కనిపించనున్నాడు. అలాగే 'సమ్మతమే' అనే మరో సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్.
![]() |
![]() |