![]() |
![]() |

త్రిగుణ్(అదిత్ అరుణ్), పూజిత పొన్నాడ జంటగా చాణిక్య చిన్న దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'కథ కంచికి మనం ఇంటికి'. ఎంపీ ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్.
'కథ కంచికి మనం ఇంటికి' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హార్రర్ ప్లస్ కామెడీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తిృగున్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హార్రర్ జోనర్ లోకి టర్న్ తీసుకుంటుంది. హార్రర్, కామెడీ రెండూ సమపాళ్లలో ఉన్నాయి. సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. 'అక్కా మళ్ళీ వస్తాను అని చెప్పే సప్తగిరి కాదు.. సప్తగిరి ఎక్స్ ప్రెస్' అంటూ సప్తగిరి చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. 2013 లో వచ్చిన సూపర్ హిట్ హార్రర్ కామెడీ మూవీ 'ప్రేమ కథా చిత్రమ్'లో సప్తగిరి కామెడీ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే సప్తగిరి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. 'కథ కంచికి మనం ఇంటికి' చిత్రంతో కూడా సప్తగిరి ఆ స్థాయిలో అలరిస్తాడేమో చూడాలి.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'కథ కంచికి మనం ఇంటికి'.. మార్చి 18న థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. వైయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించారు.
![]() |
![]() |