![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రాలు `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య` విడుదలకు సిద్ధమయ్యాయి. మార్చి 25న `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కానుండగా.. ఏప్రిల్ 29న `ఆచార్య` తెరపైకి రానుంది.
ఇదిలా ఉంటే.. చరణ్ ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `#RC 15` అనే వర్కింగ్ టైటిల్ తో పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా స్టోరీలైన్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఓ ముఖ్యమంత్రికి, ఓ ఎన్నికల కమీషనర్ కి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథాంశం అట. ఇందులో ముఖ్యమంత్రిగా నెగటివ్ రోల్ లో ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్జే సూర్య కనిపించనుండగా.. ఎలక్షన్ కమీషనర్ గా రామ్ చరణ్ దర్శనమివ్వనున్నారట. మరి.. `#RC 15` స్టోరీలైన్ పై జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Also Read: యూవీ క్రియేషన్స్ లో మరోసారి శర్వానంద్!?
`#RC 15`లో చరణ్ కి జోడీగా కియారా అద్వాని నటిస్తుండగా శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో ఎంటర్టైన్ చేయనున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ 2023 సంక్రాంతికి రిలీజ్ కానుందని టాక్.
![]() |
![]() |