![]() |
![]() |

`పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `సరిలేరు నీకెవ్వరు`.. ఇలా వరుసగా ఐదు విజయాలను అందుకున్నాడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. త్వరలో `ఎఫ్ 3`తో పలకరించబోతున్నాడు. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు అనిల్.
Also Read: రామ్ తో పూరి హీరోయిన్ రొమాన్స్!?
ఇదిలా ఉంటే, దర్శకుడిగా అనిల్ రావిపూడి తొలి మూడు చిత్రాలైన `పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`కి యంగ్ కంపోజర్ సాయి కార్తిక్ సంగీతమందించాడు. అలా.. తనతో హ్యాట్రిక్ అంకాన్ని పూర్తిచేశాడు అనిల్. ఆపై `ఎఫ్ 2` నుంచి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తో ప్రయాణం చేస్తున్నాడు రావిపూడి. ఇప్పటికే డీఎస్పీ కాంబోలో `ఎఫ్ 2`, `సరిలేరు నీకెవ్వరు` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూశాడు అనిల్ రావిపూడి. ఈ నేపథ్యంలో.. దేవిశ్రీ తో చేస్తున్న మూడో ప్రయత్నం `ఎఫ్ 3` కూడా విజయం సాధిస్తే.. అనిల్ కి ఈ కాంబినేషన్ పరంగా హ్యాట్రిక్ దక్కినట్టే. చూద్దాం.. ఏం జరుగుతుందో!
Also Read: టార్గెట్ యాంకర్ శ్యామల.. ఆడేసుకుంటున్నారు
కాగా, `ఎఫ్ 3`లో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్.. వేసవి కానుకగా మే 27న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |