![]() |
![]() |

టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఇటీవల వచ్చిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్'తో ఆయన నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పుష్ప పార్ట్-2 ని పట్టాలెక్కించే పనుల్లో బిజీ ఉన్న ఆయన మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.
తాజాగా సోషల్ మీడియా వేదికగా చిరంజీవితో దిగిన ఫోటోని పంచుకున్న సుకుమార్.. తన కల నిజమైందని, మెగాస్టార్ కోసం మెగాఫోన్ పట్టుకోబోతున్నానని, త్వరలోనే మిగతా వివరాలు తెలుస్తాయి అని పోస్ట్ చేశారు. దీంతో మెగాస్టార్-సుకుమార్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. మెగాస్టార్ ని సుకుమార్ డైరెక్ట్ చేసేది ఒక యాడ్ కోసమని తెలుస్తోంది. ఇదొక ప్రముఖ కన్ స్ట్రక్షన్ కంపెనీకి చెందిన యాడ్ అని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఇదిలా ఉంటే, కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ఆచార్య' మూవీ ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్'తో పాటు బాబీ, వెంకీ కుడుముల ప్రాజెక్ట్స్ మెగాస్టార్ చేతిలో ఉన్నాయి. మరి సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ మూవీ ఎప్పుడొస్తుందో చూడాలి.
![]() |
![]() |