![]() |
![]() |

కన్నడలో టాప్ రేడియో జాకీల్లో ఒకరైన రచన గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆమె వయసు కేవలం 39 సంవత్సరాలు. బెంగళూరు జేపీ నగర్‌లోని తన నివాసంలో ఉండగా తనకు ఛాతీ నొప్పిగా ఉందని రచన చెప్పడంతో, హుటాహుటిన ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమె తుదిశ్వాస విడిచారు. రచన ఆకస్మిక మృతి కన్నడ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.
"నువ్వు #RJRachana గా మా అందరికీ గుర్తుంటావు! కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి" అని ట్వీట్ చేశారు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. రేడియోలో తన ప్రతిభ ద్వారానే రచన పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే, మూడేళ్ల క్రితం రేడీయో జాకీ ఉద్యోగాన్ని ఆమె వదిలేశారు. 2013లో కన్నడ మూవీ 'సింపుల్ అగి ఒంద్ లవ్ స్టోరీ'లో ఆమె నటించారు. అందులో రక్షిత్ శెట్టి హీరో.
గత ఏడాదే 46 ఏళ్ల కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కూడా గుండెపోటుతోటే హఠాన్మరణం పాలయ్యారు. ఇప్పుడు చిన్న వయసులోనే ఆర్జే రచన అదే కారణంగా కన్నుమూయడం బాధాకరం.
![]() |
![]() |