![]() |
![]() |

సంతోష్ శోభన్ హీరోగా నందినీరెడ్డి డైరెక్ట్ చేస్తోన్న సినిమా 'అన్నీ మంచి శకునములే'. మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రియాంకా దత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ విశేషం.. అలనాటి నటి షావుకారు జానకి ఓ కీలక పాత్రలో కనిపించనుండటం. వెంకటేశ్ సినిమా 'బాబు బంగారం'లో హీరోయిన్ నయనతార బామ్మగా నటించిన ఆమె, పాత్ర నచ్చడంతో ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. చెన్నైలో ఉంటున్న ఆమె అక్కడే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పారు.
మిక్కీ జె. మేయర్ సంగీతం ఈ సినిమాకు ఓ ఎస్సెట్ అని తెలుస్తోంది. త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నారు. 'ఓ బేబీ' లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నందినీరెడ్డి డైరెక్ట్ చేసిన ఫీచర్ ఫిల్మ్ 'అన్నీ మంచి శకునములే'. ఈ మధ్యలో ఆమె 'పిట్ట కథలు' అనే ఆంథాలజీలోని ఒక స్టోరీని డైరెక్ట్ చేశారు.
గత ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్టుగా రిలీజైన 'ఏక్ మినీ కథ'తో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న సంతోష్, ఆ తర్వాత మారుతి డైరెక్షన్‌లో 'మంచిరోజులొచ్చాయి' సినిమాతో ఆకట్టుకున్నాడు. 'కల్యాణ వైభోగమే' సినిమా తర్వాత నందిని దర్శకత్వంలో మాళవికా నాయర్ నటిస్తోన్న సినిమా ఇది. సన్నీ కూరపాటి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ త్వరలోనే రానున్నది.
![]() |
![]() |