![]() |
![]() |

ఎన్నో ఏళ్లుగా పెళ్ళికోసం ఎదురు చూసి పెళ్లి పీటలెక్కిన యువకుడు.. తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు ఆమె బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవడంతో వారిద్దరిపై ఆ పెళ్లి కొడుకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కథతో కామెడీ రొమాన్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్ 'అహ నా పెళ్ళంట'.
ZEE5, తమడ మీడియా భాగస్వామ్యంలో నిర్మాణమవుతున్న ఈ వెబ్ సిరీస్ లో రాజ్‌తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఏబీసీడీ’కి దర్శకత్వం వహించిన సంజీవ్‌రెడ్డి ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తుండగా, రాహుల్ తమడ, సాయిదీప్‌రెడ్డి బొర్రా నిర్మిస్తున్నారు. ఈ ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలు రాజమండ్రిలోని గరిమెళ్ల సత్యనారాయణ (ట్రైనింగ్ కాలేజ్)లో ఆదివారం ఉదయం జరిగాయి.
పూజాకార్యక్రమాల అనంతరం ZEE5 హెడ్స్, తమడ మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ.. "రాజమండ్రి పరిసర ప్రాంతాలలో 15 రోజుల పాటు షూటింగ్ జరుపుతాం. రాజ్‌తరుణ్ తొలిసారిగా వెబ్ సిరీస్‌లో నటించడం వెబ్ సిరీస్‌లకు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనం. ఈ మధ్య కాలంలో అన్ని బాషల్లోని హీరోలు సైతం ఈ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. మొన్న నటుడు సుశాంత్ మంచి కంటెంట్ ఉన్న వెబ్ సీరీస్ లో నటించడానికి ముందుకు రాగా.. ఇప్పుడు రాజ్ తరుణ్ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సరికొత్త ప్రేమ కథ ఇది. అందరినీ అలరించేలా ఉంటుంది. కామెడీ, డ్రామా, రొమాన్స్‌లతో సాగే ఈ వెబ్ సిరీస్ 30 నిముషాల నిడివితో 8 ఎపిసోడ్స్ ప్రసారం అవుతుంది" అన్నారు.
దర్శకుడు సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ.. "పెళ్లి రోజున తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పెళ్లికూతురు లేచిపోతుంది. చేతిలో మంగళసూత్రం పట్టుకుని ఆమె కోసం మండపంలో పెళ్లికొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురు చూస్తూ.. తన జీవితంలో ముఖ్యమైన రోజున అలా జరుగుతుందని ఊహించని ఆ పెళ్లి కొడుకు, అందుకు కారణమైన అమ్మాయి - అబ్బాయి పై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది వెబ్ సిరీస్ లో చూడాలి." అన్నారు.

నటీనటులు: రాజ్‌తరుణ్, శివాని రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణమురళి తదితరులు.
సాంకేతిక నిపుణులు :
నిర్మాతలు: రాహుల్ తమడ, సాయిదీప్‌రెడ్డి బొర్రా, దర్శకత్వం: సంజీవ్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల, సంగీతం: జాదుహ్ శాండి, కథ, స్క్రీన్ ప్లే: దావూద్, మాటలు: కళ్యాణ్ రాఘవ, పాటలు: రఘురామ్, ఎడిటింగ్: మధు జి. రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: దివ్య రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: P.S. వర్మ, కాస్ట్యూమ్ డిజైనర్: లంక సంతోషి, శ్రీ హర్ష బాసవా, పులిచెర్ల పూర్ణ, అనిల్, సాయి, దుర్గాజి తదితరులు.
![]() |
![]() |