![]() |
![]() |

విడుదలైన రోజు నుంచి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ 11వ రోజు మరో మైలురాయిని చేరుకుంది. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.191 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ 11 రోజుల్లో 239.48 కోట్ల షేర్(359.15 కోట్ల గ్రాస్) రాబట్టి 250 కోట్ల షేర్ దిశగా పరుగులు తీస్తోంది. శనివారం 19.62 కోట్లు, ఆదివారం 16.10 కోట్ల భారీ షేర్ రాబట్టిన ఆర్ఆర్ఆర్ రెండో సోమవారం 4.98 కోట్లతో సత్తా చాటింది. నైజాంలో 70 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ 11 రోజుల్లో 99.24 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 100 కోట్లకు చేరువైంది. ఈరోజు 100 కోట్ల మార్క్ ని అందుకొని నైజాంలో 100 కోట్ల షేర్ రాబట్టిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించనుంది. సీడెడ్ లో 37 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా 45.75 కోట్లు రాబట్టి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా 50 కోట్ల దిశగా దూసుకుపోతోంది. అలాగే ఆంధ్రాలో 84 కోట్లు బిజినెస్ చేయగా ఇప్పటికే 94.49 కోట్లు కలెక్ట్ చేసి వంద కోట్ల వైపు అడుగులు వేస్తోంది.
వరల్డ్ వైడ్ గానూ ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కొనసాగుతోంది. వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 11 రోజుల్లోనే దాదాపు 510 కోట్ల షేర్ రాబట్టింది. 11 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 12.68 కోట్ల షేర్(20 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసిన మూవీ.. ఇప్పటిదాకా మొత్తం 509.48 కోట్ల షేర్(920 కోట్ల గ్రాస్ తో) సత్తా చాటింది. ఫుల్ రన్ లో 1200 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముంది.
11 రోజుల్లో ఓవర్సీస్ లో 86.85 కోట్లు(బిజినెస్ 75 కోట్లు), హిందీలో 94.40 కోట్లు(బిజినెస్ 92 కోట్లు), కర్ణాటకలో 37.75 కోట్లు(బిజినెస్ 41 కోట్లు), తమిళనాడులో 34.30 కోట్లు(బిజినెస్ 35 కోట్లు), కేరళలో 9.45 కోట్లు(బిజినెస్ 9 కోట్లు), రెస్టాఫ్ ఇండియా 7.25 కోట్లు(బిజినెస్ 8 కోట్లు) ఇలా అన్ని చోట్లా భారీ షేర్ తో దూసుకుపోతోంది. కర్ణాటక, తమిళనాడు మినహా దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఫుల్ రన్ లో దాదాపు అన్ని ఏరియాల బయ్యర్లు భారీ లాభాలు చూడనున్నారు.
![]() |
![]() |