![]() |
![]() |
.webp)
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బద్రి' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రేణు దేశాయ్.. ఆ తర్వాత పవన్ తో కలిసి 'జానీ' సినిమాలోనూ నటించింది. అలాగే 'ఖుషి' నుంచి 'అన్నవరం' వరకు పలు పవన్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన ఆమె 2009 పవన్ ని ప్రేమ విహహం చేసుకుంది. కొన్నేళ్ళకే ఈ జంట విడిపోయింది. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో గడుపుతూ నటనకు దూరమైన రేణు.. చాలా ఏళ్ల తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో మళ్ళీ నటిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ లాంచ్ వేడుకలో అనుకోకుండా రేణుని చూసిన మెగాస్టార్ చిరంజీవి సర్ ప్రైజ్ లుక్ ఇవ్వడం విశేషం.
రవితేజ హీరోగా నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ వేదిక వద్దకు చిరంజీవి అక్కడ నిల్చొని ఉన్న రేణుని ఆశ్చర్యంగా చూశారు. 'ఓ మీరు కూడా ఉన్నారా మూవీలో' అన్నట్లుగా ఆయన సర్ ప్రైజ్ లుక్ ఇచ్చారు. అయితే ఆ సమయంలో రేణు మాత్రం ఏం మాట్లాడకుండా కేవలం ఓ నవ్వు నవ్వి ఊరుకున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు'కి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో సందడి చేయనుంది. వంశీ 2019లో ఈ సినిమా కథలోని పాత్ర గురించి చెప్పారు. ఆ టైంలో మరలా తెరపై కన్పించాలనే ఆలోచనలేదు. కానీ పాత్ర బాగా నచ్చడంతో చేయాలనే ఉత్సాహం కలిగింది అని మూవీ లాంచ్ సందర్భంగా రేణు తెలిపారు. మరి లాంగ్ గ్యాప్ తర్వాత నటిగా రీఎంట్రీ ఇస్తున్న రేణు ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
![]() |
![]() |