![]() |
![]() |

2022 ఏప్రిల్ నెలలో వారం వ్యవధిలోపు రెండు ఆసక్తికరమైన స్పోర్ట్స్ డ్రామాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. వేర్వేరు భాషల్లో రాబోతున్న ఈ రెండు సినిమాలు.. విభిన్న నేపథ్యాలతో తెరకెక్కడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్ లోనే తొలిసారిగా నటించిన స్పోర్ట్స్ డ్రామా `గని`. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ తెలుగు చిత్రంలో `గని`గా టైటిల్ రోల్ లో కనిపించనున్నాడు వరుణ్. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఏప్రిల్ 8న రిలీజ్ కానుంది. కట్ చేస్తే.. వారంలోపే అంటే ఏప్రిల్ 14న మరో స్పోర్ట్స్ డ్రామా వస్తోంది. ఆ సినిమానే.. `జెర్సీ`. నేచురల్ స్టార్ నాని నటించిన తెలుగు చిత్రం `జెర్సీ`కి హిందీ వెర్షన్ గా తయారైన ఈ క్రికెట్ బేస్డ్ ఫిల్మ్ లో షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటించగా.. మాతృక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. మరి.. బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలు బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.
కొసమెరుపు ఏంటంటే.. `గని` చిత్రంతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుండగా.. హిందీ `జెర్సీ` నిర్మాతల్లో ఒకరిగా అల్లు అరవింద్ వ్యవహరించారు. మొత్తమ్మీద.. అల్లు కాంపౌండ్ ప్రొడ్యూసర్స్ కి స్పోర్ట్స్ డ్రామాలతో ఏప్రిల్ 2022 ఎంతో ప్రత్యేకం కానుందన్నమాట.
![]() |
![]() |