![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' మూవీ దిల్ రాజులో ఎక్కడ లేని ఉత్సాహం తీసుకొచ్చింది. ఆయన ఆర్ఆర్ఆర్ నైజాం రైట్స్ రూ.70 కోట్లకు దక్కించుకోగా ఇప్పటికే 99 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఫుల్ రన్ లో ఆయనకు దాదాపు 40 కోట్లకు ప్రాఫిట్ వచ్చే అవకాశముందని అంటున్నారు. నైజాంలో 'బాహుబలి-2' ఫుల్ రన్ లో 68 కోట్లు రాబట్టింది. అలాంటిది ఆర్ఆర్ఆర్ రైట్స్ 70 కోట్ల రికార్డు ప్రైస్ కి దక్కించుకోవడం రిస్క్ అని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండటంతో దిల్ రాజు ఫుల్ ఖుషీ ఉన్నారు. అందుకే ఆయన సొంతంగా ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీని నిర్వహించారు.
హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో సోమవారం రాత్రి దిల్ రాజు గ్రాండ్ గా సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి డైరెక్టర్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు మూవీ టీమ్, పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ పార్టీలో ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా చోటుచేసుకుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి 'నాటు నాటు' సాంగ్ కి డ్యాన్స్ చేశారు.

దిల్ రాజు బ్యానర్ లో 'F3' మూవీ చేస్తున్న అనిల్.. 'ఆర్ఆర్ఆర్' విడుదలకి ముందు రాజమౌళి, తారక్, చరణ్ తో ఇంటర్వ్యూ నిర్వహించిన సంగతి తెలిసిందే. సక్సెస్ పార్టీలో అనిల్ తో కలిసి రాజమౌళి నాటు నాటు స్టెప్ వేయాలని ఆ ఇంటర్వ్యూలో తారక్ ఛాలెంజ్ చేశాడు. అన్నట్లుగానే దిల్ రాజు ఇచ్చిన సక్సెస్ పార్టీలో రాజమౌళి-అనిల్ నాటు స్టెప్ వేసి అదరగొట్టారు. ఆ సమయంలో స్టేజ్ ముందు ఉన్న తారక్, చరణ్ వారి డ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![]() |
![]() |