![]() |
![]() |
.jpg)
ఆగస్టులో ఆటకు సిద్ధమని నాగశౌర్య దర్శక, నిర్మాతలకు చెప్పాడట. అతడి ఆటలకు, దర్శక-నిర్మాతలకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? సుమంత్ హీరోగా 'సుబ్రమణ్యపురం' తీసిన సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య ఓ సినిమా చేయనున్నాడు. స్పోర్ట్స్ బేస్డ్ సినిమా అది. విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న ఆ సినిమాలో నాగశౌర్య విలుకాడు (ఆర్చర్)గా కనిపించనున్నాడు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
మార్చిలో, మన దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చకముందు కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ ఆగింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సేఫ్టీ మెజర్స్ తీసుకుని షూటింగ్ చేసేటట్టు అయితే తాను వస్తానని నిర్మాతలతో నాగశౌర్య చెప్పాడట. దర్శకుడికి సైతం షూటింగ్ చేయడానికి అభ్యంతరాలు లేకపోవడంతో ఆగస్టులో మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. ఈ సినిమాను శరత్ మరార్, నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
![]() |
![]() |