![]() |
![]() |
.jpg)
స్టార్ మా ఛానల్‌లో బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగో సీజన్ త్వరలో మొదలు కానుంది. ఆల్రెడీ 'కమింగ్ సూన్' అంటూ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈసారి షో నిర్వహణలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్లను ఎవరైనా సరే ముందుగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, ఆ 14 రోజులలో వైరస్ తాలూకు లక్షణాలు ఏవీ కనిపించకపోతే కరోనా టెస్ట్ చేసి, నెగెటివ్ రిజల్ట్ వస్తేనే హౌస్‌లో పంపించాలని నిర్వాహకులు డిసైడ్ అయ్యారట. క్వారంటైన్‌లో ఉండటానికి సమ్మతించిన వాళ్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంన్నారట. కరోనా నేపథ్యంలో హౌస్‌ను కూడా ముందుగా శానిటైజ్ చేస్తున్నారని, షో స్టార్ట్ అయిన తరవాత కూడా రెగ్యులర్‌గా శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారట.
కరోనా నేపథ్యంలో కంటెస్టెంట్ల ఎంపికను సైతం జూమ్ కాల్స్ ద్వారా చేశారు. కొత్త కంటెస్టెంట్లకు ఇచ్చే టాస్క్‌లలో శానిటైజ్ సీజేసే టాస్క్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. గతంలో కంటే ఈసారి షో ఫార్మాట్ డిఫరెంట్ గా, కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట.
![]() |
![]() |