![]() |
![]() |

పవన్ కళ్యాణ్ పేరుతో పబ్లిసిటీ పొందడం రామ్ గోపాల్ వర్మకు కొత్త ఏమీ కాదు. పవన్ తల్లిని తిట్టమని, తద్వారా పబ్లిసిటీ పొందమని శ్రీరెడ్డికి సలహా ఇచ్చిన ఘనుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరుతో క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడంతే! అయితే... క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నం బెడిసికొట్టడంతో ట్రైలర్ లీక్ డ్రామాకు శ్రీకారం చుట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
'ప్రవన్ కళ్యాణ్' అని వర్మ ఎంత చెబుతున్నా... పవన్ కళ్యాణ్ అండ్ ఫ్యామిలీని బద్నామ్ చేయడానికి 'పవర్ స్టార్' సినిమా తీస్తున్నాడని సినిమాలను ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా చెబుతారు. పవన్ అంటే వర్మకు అంత కోపం ఎందుకనేది ఎవరికీ అర్థం కాదు. 'పవర్ స్టార్' సినిమాతో డబ్బులు సంపాదించడమే కాదు... ట్రైలర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించాలని వర్మకు ఆశ కలిగింది. ట్రైలర్ చూడాలని అనుకున్నవాళ్ళు 25 రూపాయలు కట్టాలని కొత్త స్కీమ్ ప్రవేశపెట్టారు. 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూడటానికి 200 రూపాయలు టికెట్ పెట్టమని రాజమౌళికి ఉచిత సలహా ఇచ్చారు.
'పవర్ స్టార్' ట్రైలర్ బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే... అంతకంటే ముందే రామ్ గోపాల్ వర్మ అఫీషియల్ యుట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేశారు. ఆల్రెడీ ట్రైలర్ లీక్ కావడంతో తప్పక సొంత యుట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేశామని వర్మ తెలిపారు. అయితే, అసలు మేటర్ వేరే ఉందని టాక్. ట్రైలర్ చూడటానికి 25 రూపాయలు కట్టిన వాళ్ళు పెద్దగా లేరని, ఆ డబ్బు కంటే యుట్యూబ్ లో రిలీజ్ చేస్తే... యుట్యూబ్ యాడ్స్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని తేలడంతో లీకేజ్ డ్రామాకు వర్మ ప్లాన్ చేశారని నెటిజన్స్ టాక్. యుట్యూబ్ అయితే పవన్ ఫ్యాన్స్ చూస్తారు.. ఫ్రీగా కాబట్టి. అదే 25 రూపాయలు కట్టాలంటే ఎవరూ ముందుకు రారు. అదీ వర్మ ప్లాన్ అని టాక్.
![]() |
![]() |