![]() |
![]() |
.jpg)
లాక్‌డౌన్‌లో హీరోలలో దాదాపు చాలామంది సైలెంట్‌గా ఇళ్లలో కూర్చున్నారు. షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా? చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేద్దామా? అని వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మాత్రం కథలు వింటూ కాలం గడిపాడు. ఒకట్రెండు కాదు... సుమారు 18 కథలను ఆయన విన్నారట. లాక్‌డౌన్ ముందునుంచి, 'జీరో' మూవీ ప్లాప్ తరవాత సినిమాలు ఏవీ చేయకుండా ఖాళీగా ఉన్న ఆయన, కొత్త కథలపై కాన్సంట్రేట్ చేశారట.
రాజ్ కుమార్ హిరానీ, అలీ అబ్బాస్ జాఫర్, సిద్దార్థ్ ఆనంద్, తిగ్మన్షు ధూళియా, మధుర్ భండార్కర్, రాజ్ అండ్ డీకే వంటి బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌తో పాటు సౌత్ నుండి డైరెక్టర్ అట్లీ కూడా షారుఖ్ ఖాన్‌కి కథలు చెప్పిన దర్శకుల జాబితాలో ఉన్నారు. సుమారు 18 మంది దర్శకులు బాలీవుడ్ బాద్షా గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. 18 కథలలో నాలుగైదు కథలలో తాను నటించాలని షారుఖ్ భావిస్తున్నారట. మిగతా కథలను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారట.
![]() |
![]() |