![]() |
![]() |
.jpg)
తొమ్మిది హీరోలు, తొమ్మిది కథలు, తొమ్మిది దర్శకులతో ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం 'నవరస' అని ఓ వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆయన కూడా ఓ ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించనున్నాడు. ప్రముఖ తెలుగు దర్శకుడు సుకుమార్ సైతం అటువంటి వెబ్ సిరీస్ ఒకటి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే... డిఫరెంట్ జానర్లలో డిఫరెంట్ కథలతో మణిరత్నం 'నవరస' ప్లాన్ చేస్తే, ప్రేమలో డిఫరెంట్ స్టోరీస్ తీసుకుని సుకుమార్ వెబ్ సిరీస్ తీయాలని అనుకుంటున్నారట.
అమెజాన్ ప్రైమ్‌లో ది న్యూయార్క్ టైమ్స్‌లో పబ్లిష్ అయిన వీక్లీ కాలమ్ బేస్ చేసుకుని 'మోడరన్ లవ్' అని ఒక యాంథాలజీ సిరీస్ వచ్చింది. ఆ టైపులో ఒక చైనీస్ నవల ఆధారంగా తొమ్మిది ప్రేమకథలతో సుకుమార్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. ఒకట్రెండు కథలు ఆయన దర్శకత్వం వహిస్తారనీ, మిగతా కథలతో గతంలో ఆయన దగ్గర దర్శకత్వశాఖలో పని చేసి, ప్రస్తుతం దర్శకులు అయినవారు, ఆయనకు సన్నిహితులైన దర్శకులు సైతం దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఆహా ఓటీటీ కోసం ఈ సిరీస్ చేస్తున్నారట.
![]() |
![]() |