![]() |
![]() |

యువ కథానాయకుడు సాయితేజ్ నటించిన తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్' విడుదలకు సిద్ధమైంది. డెబ్యూ డైరెక్టర్ సుబ్బు రూపొందించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కానుందని టాక్. కాగా, ఈ సినిమా తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నారు తేజ్. 'రిపబ్లిక్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.
కాగా, ఈ సినిమా తాలూకు చిత్రీకరణని శరవేగంగా జరిపి.. 2021 వేసవిలో విడుదల చేయాలని దేవ కట్టా అండ్ టీమ్ ప్లాన్ చేశారట. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సమ్మర్ సీజన్ లో 'సుప్రీమ్' (2016), 'చిత్రలహరి' (2019) రూపంలో మంచి విజయాలనే చూశారు తేజ్. మరి.. లక్కీ సీజన్ లో రానున్న 'రిపబ్లిక్' తోనూ ఆ విజయ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
![]() |
![]() |