![]() |
![]() |

గాయనిగా కెరీర్ ని ఆరంభించి ఆపై కథానాయిక అవతారమెత్తారు మమతా మోహన్ దాస్. యమదొంగలో యంగ్ టైగర్ యన్టీఆర్ జోడీగా నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ అందాల నటి.. ఆపై విక్టరీ వెంకటేష్ సరసన చింతకాయల రవిలోనూ, కింగ్ నాగార్జునతో కింగ్, కేడి చిత్రాల్లోనూ సందడి చేశారు. గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమై.. మలయాళంలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. త్వరలో టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారట.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో.. సదరు కొణిదెల స్టార్ కి జోడీగా మమత దర్శనమివ్వనున్నారని సమాచారం. ఇదివరకు ఈ పాత్ర కోసం సాయిపల్లవి, ఐశ్వర్యా రాజేష్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు మమత వంతు. మరి.. వీరిలో ఎవరు కన్ఫామ్ అవుతారో వేచిచూడాలి.
సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ రీమేక్ కి తమన్ బాణీలు అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
![]() |
![]() |