![]() |
![]() |

బుధవారం లేడీ సూపర్‌స్టార్ నయన్‌తార తన 36వ బర్త్‌డే జరుపుకుంది. ఈ సందర్భంగా ఇంట్లో ఆమెను అందంగా సర్‌ప్రైజ్ చేశారు తల్లిదండ్రులు. ఇంట్లోని ప్రతి చోటునూ బెలూన్లు, లైట్లు, ఇతర అలంకరణ సామగ్రితో చక్కగా అలంకరించారు. ఒక కేక్ కాకుండా నాలుగు కేక్‌లను వారు కుమార్తె కోసం రెడీ చేశారు. అయితే ఈ బర్త్‌డే వేడుకలో నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ పాల్గొనలేదు. పని వల్ల అతను దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ, నయన్ ఇంట్లో అందంగా, ఆహ్లాదకరంగా జరిగిన ఆమె పుట్టినరోజు సందడికి సంబంధించిన కొన్ని పిక్చర్లను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు విఘ్నేశ్.
"How sweeet!!!.. Such a lovely surprise from Amma, appa & Lenu Kurian the sweetest bro possible :)) our dearest chaaaach:))... missed being around.... yet happy." అంటూ అతను రాసుకొచ్చాడు. ఆ పిక్చర్స్‌లో బ్లాక్ ప్రింటెడ్ డ్రస్‌లో గార్జియస్‌గా కనిపిస్తోంది నయన్. అన్ని పిక్చర్స్‌లోనూ ఆమె ఒక్కతే ఉంది. బ్యూటిఫుల్ బర్త్‌డే బ్యాక్‌డ్రాప్‌లో ఇదివరకెన్నడూ కనిపించని రీతిలో చాలా ఆనందంగా ఆ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది నయన్. సాధారణంగా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడని నయన్‌కు సంబంధించిన ఇలాంటి అందమైన క్షణాలు ఇప్పుడు విఘ్నేశ్ పుణ్యమా అని ఆమె ఫ్యాన్స్‌ను అమితంగా అలరిస్తున్నాయి.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
![]() |
![]() |