![]() |
![]() |

ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా అభిమానులు ఎదురు చూసేవారు. యువి క్రియేషన్స్ సంస్థ మీద సోషల్ మీడియాలో సెటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే... బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఊహించని అప్డేట్ లు ఇస్తూ ప్రభాస్ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాడు.
ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ తెరకెక్కించనున్న సినిమా 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రకటించిన దగ్గర నుండి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 11, 2022లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భారీ చిత్రాలకు అప్డేట్లు ఇచ్చేముందు సోషల్ మీడియాలో హడావిడి చేయడం సహజం. అటువంటిది ఏదీ లేకుండా సడన్ గా ఈరోజు ఉదయం రిలీజ్ డేట్ ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు సైతం సర్ ప్రైజ్ ఫీలయ్యారు.
'ఆది పురుష్' విడుదల కోసం లాంగ్ వీకెండ్ మీద ప్రభాస్ కన్నేశాడు. ఆగస్టు 11 గురువారం వచ్చింది. శుక్రవారం సినిమాలు రిలీజ్ చేయడం రివాజు. దానికి ఒక్కరోజు ముందుకు ప్రభాస్ వెళ్ళాడు. సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా గురువారం భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు గ్యారెంటీ. అభిమానులు తొలిరోజే సినిమా చూడాలని ఆరాటపడతారు. శుక్ర, శని, ఆదివారాలు వీకెండ్ కనుక ప్రేక్షకులు వస్తారు. ఆ తరువాత సోమవారం దేశ వ్యాప్తంగా సెలవు రోజు. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే. చాలా మంది సరదాగా సినిమాలకు వెళ్తారు. అలా మొత్తం అయిద రోజులు... లాంగ్ వీకెండ్ మీద ప్రభాస్ కన్నేశాడు.

![]() |
![]() |