![]() |
![]() |

యంగ్ టైగర్ యన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అరవింద సమేత వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాని యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతమందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ మార్చి నుంచి పట్టాలెక్కనుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో తారక్ కి జోడీగా ఇద్దరు నాయికలు నటిస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రష్మిక మందన్న, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్స్ రేసులో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. కాగా, ఇప్పుడు సెకండ్ లీడ్ కోసం కేతికా శర్మ అనే యంగ్ హీరోయిన్ కన్ఫామ్ అయినట్లు ఫిల్మ్ నగర్ బజ్. ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న రొమాంటిక్ చిత్రంలో కేతిక నాయికగా నటిస్తోంది. నాగశౌర్యతోనూ ఓ సినిమా చేస్తోందీ అమ్మడు. అలాగే అల్లుడు అదుర్స్ లోనూ ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. త్వరలోనే యన్టీఆర్ 30లో కేతిక ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
![]() |
![]() |