![]() |
![]() |

సమంత అక్కినేని ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం 'సామ్ జామ్' అనే టాక్ షోను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలి ఎపిసోడ్‌లో ఆమె విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేయడం మనం చూశాం. లేటెస్ట్‌గా ఆమె మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఈ షోకు వచ్చిన మెగాస్టార్ పిక్చర్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి వచ్చాయి. చిరంజీవి ఫార్మల్ దుస్తుల్లో యువకుడిలా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తున్నారు. ఈ షో సెట్స్‌కు ఆయన తన పెద్ద కుమార్తె సుస్మితతో వచ్చారు. సెట్స్‌కు ఫేస్ మాస్క్‌తో వచ్చిన ఆయన, ఇంటర్వ్యూ సందర్భంగా దానిని తీసివేశారు.
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' మూవీ చేస్తున్నారు. ఆయన జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా 'ఆచార్య' మోషన్ పోస్టర్ రిలీజయ్యింది. ఇటీవలే ఈ మూవీ షూట్‌ను పునరుద్ధరించారు. ఆయన ఆ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా, టెస్ట్‌లో ఆయనకు కొవిడ్ 19 పాజిటివ్ అంటూ రిజల్ట్ రావడంతో అందరూ ఖంగుతిన్నారు. దాంతో ఆయన లేకుండా మిగతా ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్‌ను తీస్తూ వస్తున్నారు కొరటాల.
రెండు రోజుల తర్వాత కూడా తనకు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో మరోసారి టెస్ట్ చేయించుకున్నారు మెగాస్టార్. అప్పుడు రిజల్ట్ నెగటివ్ అని రావడంతో, మరో రెండు చోట్ల కూడా టెస్ట్ చేయించుకున్నారు. అప్పుడూ నెగటివే వచ్చింది. దీంతో మొదటిసారి పాజిటివ్ అని రిజల్ట్ వచ్చిన కిట్‌లో లోపాలున్నాయనే నిర్ధారణకు వచ్చారు చిరంజీవి. త్వరలోనే ఆయన 'ఆచార్య' షూట్‌లో జాయినవనున్నారు. ఈలోగా 'సామ్ జామ్' టాక్ షోలో ఆయన పాల్గొన్నారు. 'ఆచార్య' షూటింగ్ అయిపోగానే ఆయన మలయాళం బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్' రీమేక్‌లో నటించనున్నారు.
.jpg)
![]() |
![]() |